అమరావతి : ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ (MP Keshineni) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ ఆదివారం ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. ఏసీఏ ( ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్)లోని ఇతర పదవులకూ కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.
ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీష్ , జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా విష్ణుతేజ్ ఎన్నికైనట్లు నిమ్మగడ్డ రమేశ్ తెలిపారు. గత 20 రోజుల క్రితం అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించగా కేశినేని చిన్ని(శివనాథ్) ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన లాంఛనంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికలైన సందర్భంగా కేశినేని సీఎం సహాయనిధి కింద వరద బాధితులను ఆదుకునేందుకు రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు.