అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఇద్దరు పిల్లలను..
Murder | ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఆనంద్ నగర్లో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపేసింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఆనంద్ నగర్లో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపేసింది. ఆనంద్ నగర్లో బ్యుటీషియన్‌గా పనిచేస్తున్న లక్ష్మీ అనూషకు కూతురు చిన్మయి, కుమారుడు మోహిత్ ఉన్నారు. 13 ఏండ్ల క్రితం భర్త చనిపోవడంతో తాడేపల్లి నుంచి రాజమండ్రి వచ్చి జీవనం సాగిస్తున్నది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నది.
అయితే తరచూ పిల్లలను కొడుతుండటంతో అనూష తల్లి కనకదుర్గ.. ఆమెను మందలించింది. దీంతో కనకదుర్గను అనూష గాయపర్చింది. కాగా, ఆదివారం రాత్రి తన పిల్లకు ఉరివేసి చంపేసింది. అనంతరం ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. కాగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నది. చిన్నారుల మృతదేహాను స్వాధీనం చేసుకుని రాజమండ్రి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిందితురాలు అనూషను అరెస్టు చేశారు. ఆమెపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవడాని ఈ హత్యలకు పాల్పడిందా లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
‘పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

