‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
కార్మిక హక్కుల సాధన కోసం దేశంలో ఏర్పడిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని ఆ సంఘం రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి అన్నారు. ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండలోని పలు కేంద్రాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు...
– ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి
– నల్లగొండలో ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవం
రామగిరి అక్టోబర్ 31 : కార్మిక హక్కుల సాధన కోసం దేశంలో ఏర్పడిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని ఆ సంఘం రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి అన్నారు. ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండలోని పలు కేంద్రాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31న కార్మికుల హక్కులు, గౌరవప్రదమైన జీవనం, సామాజిక న్యాయం లక్ష్యంగా ఏర్పడిన ఏఐటీయూసీ 107 ఏళ్లుగా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులకు ప్రమాదకరంగా మారుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాలు, కనీస వేతనాల సమస్యలు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు.
నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించాలని, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని, ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి పెన్షన్, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రత కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా సంఘటితమై పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ఎస్.రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి ఎం.డి.జానీ, ఉపాధ్యక్షుడు బి.వెంకటేశ్, జిల్లా కోశాధికారి దొనకొండ వెంకన్న, డివిజన్ కార్యదర్శి వి.లెనిన్, భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షుడు గుండె రవి, కార్యదర్శి రేవల్లి యాదయ్య, కోశాధికారి నరసింహ తదితర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

