Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మియాపూర్ భూముల విషయంలో బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మియాపూర్ భూముల ( Miyapur Lands ) విషయంలో బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ( Harish Rao ) విమర్శించారు. రేవంత్ రెడ్డి అబద్ధాలకు ( Lies ) బ్రాండ్ అంబాసిడర్ ( Brand Ambassador ) గా నిలిచిపోనున్నారని దుయ్యబట్టారు. సీఎంకు అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని వ్యాఖ్యనించారు.
మియాపూర్ భూములు తెలంగాణ ప్రభుత్వానికి చెందినవేనని సుప్రీంకోర్టు వెల్లడించిన నేపధ్యంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అబద్ధాలతో క్రెడిట్ చోరీలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మియాపూర్ భూముల విషయంపై సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కాపీ కూడా ఇంకా రాకముందే ఆ భూములను అమ్ముకోవాలనే ఆతృత సీఎంలో కనిపించిందని ఆరోపించారు.
కేసీఆర్ సీఎం అయ్యాక వైద్యనాథన్ అనే సీనియర్ అడ్వకేట్‌ను నియమించి భూములు ప్రభుత్వానికి దక్కేలా న్యాయపోరాటం చేసి కాపాడారని గుర్తు చేశారు. మంచిరేవులలో 142 ఎకరాలు కాపాడామని గొప్పలు చెప్పుకుంటే కాంగ్రెస్ ఆ భూములు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టెలా ప్రయత్నించిందని పేర్కొన్నారు.
మంచిరేవుల్లోని 10 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని విమర్శించారు. భూపాలపల్లి భూములు, హయాత్‌నగర్‌లోని భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ అన్నిరకాలుగా కాపాడిందని ఆరోపించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లను రేవంత్ రెడ్డి అప్పుగా తెచ్చుకున్నారని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
‘పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

