అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తో (Nirmala Sitharaman) ఢిల్లీలో భేటీ అయ్యారు. నాలుగురోజుల దావోస్ ( Davos ) పర్యటనను ముగించుకుని అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం రాత్రి ఢిల్లీలోనే అధికారిక నివాసంలో బస చేశారు.
శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై రానున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కెటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు.
ఆడపిల్లల భద్రత, శ్రేయస్సు మా లక్ష్యం
ఏపీలో ఆడపిల్లల భద్రత, శ్రేయస్సు ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం (National Girls day) సందర్భంగా రాష్ట్రంలోని ఆడపిల్లలందరికీ ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు.
2047 స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా ఆడపిల్లలు రేపటి మూలస్తంభాలుగా ప్రకాశించేలా చేస్తామని అన్నారు. ఆడబిడ్డలకు సమాన అవకాశాలు కల్పిస్తూ మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని బాలికలకు శుభాకాంక్షలు తెలిపారు.