అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షం కురిసే సూచనలున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది.