AP News | వైసీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ రాజీనామా
AP News | వైసీపీకి మరో షాక్ తగిలింది. కైకలూరు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పార్టీని వీడారు. ఎమ్మెల్సీ పదవితో పాటు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు జయమంగళ వెంకటరమణ శనివారం ప్రకటించారు. రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ మోసేనురాజుకు పంపించినట్లు తెలిపారు.

కైకలూరు నియోజకవర్గం నుంచి గతంలో జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీగా గెలిచారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ సమక్షంలో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. దీంతో ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో వెంకటరమణ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా పలువురు కీలక నేతలు వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే జయమంగళ వెంకటరమణ వైసీపీకి గుడ్బై చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్