కలకలం..ఏపీలో నలుగురు పదో తరగతి విద్యార్థినీల అదృశ్యం
missing|ఒకే ప్రభుత్వ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినీల అదృశ్యం ఆ గ్రామంలో కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో
అమరావతి : ఒకే ప్రభుత్వ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినీల అదృశ్యం ఆ గ్రామంలో కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినుల్లో ఒకరు గత నెల 30 నుంచి కనిపించకుండా పోగా మరో ముగ్గురు నిన్నటి నుంచి( శనివారం )కనిపించక పోవడంతో విద్యార్థినీల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తమ కుమార్తెలు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నలుగురు అమ్మాయిలు అదృశ్యమైనప్పటికీ.. ఇద్దరు అమ్మాయిలు మాత్రమే కనిపించడం లేదని ఫిర్యాదులు అందాయని, మరో ఇద్దరు అమ్మాయిల అదృశ్యంపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. గత నెల 30న ఉదయం స్కూల్ కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన విద్యార్థి సాయంత్రం వరకు కూడా ఇంటికి చేరుకోక పోవడంతో బాలిక తల్లిదండ్రులు పాఠశాల, ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆచూకీ కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
ఈ దశలో ఇదే పాఠశాలకు చెందిన పదోతరగతికి చెందిన ముగ్గురు బాలికలు శనివారం తెల్లవారుజాము నుంచి కనిపించకుండా పోవడం గ్రామంలో సంచలనం కలిగించింది. పిఠాపురం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే విద్యార్థినీలు హైదరాబాద్ కు వెళ్లినట్లు సాంకేతిక ఆదారాలు, సీసీ కెమెరా రికార్డుల ఆధారంగా తెలుస్తోంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

