అమరావతి : ఇన్స్టాగ్రామ్లో ( Instagram ) పరిచయమైన ముగ్గురు మైనర్లను మోసగాళ్లు తీసుకెళ్తుండగా పోలీసులు సకాలంలో స్పందించి వారిని కాపాడారు. ఏపీలోని విజయవాడకు చెందిన ముగ్గురు బాలికలను మోసాగాళ్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. వారికి మాయమాటలు చెప్పి బెంగళూరు( Banglore) , హైదరాబాద్కు తరలించేందుకు వ్యూహం పన్నారు.
వ్యూహంలో చిక్కుకుపోయిన మైనర్లు ఇంట్లో చెప్పాపెట్టకుండా అదృశ్యమయ్యారు. దీంతో వారి తల్లిదండ్రులు వెంటనే ఫిర్యాదు చేయడంతో విజయవాడలోని (Vijayawada) అజిత్సింగ్ నగర్ పోలీసులు రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లకు సమాచారం అందించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
గాలింపులో భాగంగా తెనాలి వద్ద ముగ్గురు బాలికలతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు బాలికలను ఇంటికి చేర్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అదృశ్యమైన కేసులో మరో బాలికను పోలీసులు పట్టుకుని ఇంటికి చేర్చారు. నిందితులపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అజిత్సింగ్ నగర్ పోలీసులు వెల్లడించారు.