AP News | భూకబ్జా ఆరోపణలపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. భూదందాకు సహకరిస్తున్నానన్న ఆరోపణలు నిరూపించాలని సవాలు విసిరారు. కావాలనే కొంతమంది మహిళలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. భూదందాలో తన ప్రమేయం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలు అరెస్టవుతున్నారని వాసంశెట్టి సుభాశ్ తెలిపారు. త్వరలో ఓ మాజీ మంత్రి, అతని కుమారుడు కూడా అరెస్టు కాబోతున్నారని పేర్కొన్నారు. వారి అవినీతిని బయటపెడతామని స్పష్టం చేశారు.తాను భూ కబ్జాకు పాల్పడ్డానని కొంతమంది రామచంద్రపురంలో ధర్నా చేశారని.. ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు.
వైసీపీ నేత పిల్లి సూర్య ప్రకాశ్ అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారని వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. పిల్లి సూర్యప్రకాశ్ చేసిన ఆరోపణలపై లీగల్ నోటీసులు ఇచ్చానని తెలిపారు. ఆధారాలు చూపకపోతే సివిల్, క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు.