అమరావతి : భారత వాతావరణ శాఖ ( Meteorological Department ) ఆంధ్రప్రదేశ్ (ndhra Pradesh ) కు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక జిల్లాలో 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.
ఇప్పటికే పలు జిల్లాలో నిప్పులు చెరిగే ఎండతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిర వుతున్నారు. ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.
మరోవైపు వాయవ్య అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, కోస్తాంధ్ర, కేరళ, కర్ణాటక, రాయలసీమ, మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కి.మీ ఎత్తులో ఆవర్తనం ఉందని,దీని ప్రభావంతో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లు పడే అవకాశముందని వెల్లడించారు.