హైదరాబాద్: ఆస్ట్రేలియాలో (Australia) స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తు మృతిచెందింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (Ujwala Vemuru) ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న బాండ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తిచేసింది. ప్రస్తుతం రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నది. అయితే ఈ నెల 2న సరదాగా స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లింది.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. దీంతో అక్కడే స్థిరపడిన ఆమె తల్లిదండ్రులు వేమూరి మైథిలి, వెంకటేశ్వరరావు.. అంత్యక్రియల నిమిత్తం ఆమె భౌతిక కాయాన్ని ఉంగటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తరలిస్తున్నారు.