హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు సహా 14 మంది మరణించారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రా రెడ్డి (Maoist Chalapathi) అలియాస్ జైరామ్ కూడా ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన వారు. చలపతిపై ప్రభుత్వాలు రూ.కోటి రివార్డు ప్రకటించారు.
ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని కులరిఘాట్ అడవుల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సోమవారం సాయంత్రం గరియాబంద్తోపాటు నౌపడ్ జిల్లాలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులు సంయుక్తంగా కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు 14 మంది మృతిచెందారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలతోపాటు కేద్ర కమిటీ సభ్యులైన చలపతి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డూ కూడా ఉన్నారు.