నెల్లూరు: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు (Nellore) జిల్లా దత్తలూరులో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన వ్యక్తి.. అత్తమామలు అడ్డురావడంతో వారినీ నరికేశాడు. దుత్తలూరులోని ఎస్టీ కాలనీకి చెందిన ఏలూరి వెంగయ్య, అంకమ్మ భార్యాభర్తలు. మద్యం మత్తులో ఉన్న వెంగయ్య.. భార్యపై కోపంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. అయితే అతడిని అడ్డుకునేందుకు మామ కంజయ్య, అత్త జయమ్మ ప్రయత్నించారు. దీంతో వారిని నరికేశాడు.
తీవ్రంగా గాయపడిన అత్తమామలు అక్కడికక్కడే మృతిచెందారు. భార్య అంకమ్మకు తీవ్రంగా గాయపడింది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అంకమ్మను ఉదయగిరి దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. నిందితుడు వెంగయ్య పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.