అమరావతి : చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందిన సంఘటన జిల్లాలోని పెద్ద పంజాని మండలం పెనుగొలకల గ్రామంలో విషాదం నింపింది. అడవిలో కట్టెల సేకరణకు వెళ్లిన బంగారప్ప(45) అనే వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది.
తీవ్రగాయాల పాలైన బంగారప్పను పలమనేరు ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు.