అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. కొత్తగా కొన్న ఎలక్ట్రిక్ బైక్ (EV bike) ఆ ఇంట్లో కన్నీటిని మిగిల్చింది. చార్జింగ్ పెట్టిన బ్యాటరీ పేలడంతో ఒకరు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడలోని సూర్యారావుపేటకు చెందిన శివకుమార్.. శుక్రవారం ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశారు. నిన్న రాత్రి బెడ్రూమ్లో బైక్ బ్యాటరీకి చార్జింగ్ పెట్టి కుటుంబ సభ్యులంతా పడుకున్నారు. అయితే శనివారం తెల్లవారుజామున బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోవడంతో ఇంట్లో మంటలు అంటుకున్నాయి. దీంతో శివకుమార్‌తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలిస్తుండగా శివకుమార్ మృతిచెందారు. ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.