అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కంచర్లపాలెం వద్ద ఆటోలో వెళ్తున్న వ్యక్తిని దుండగుడు అటకాయించి కత్తులతో నరికి చంపాడు. మృతుడు తెనాలి వాసి రబ్బానీ సాహెబ్‌గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.