తిరుమల : ఈనెల 29న నాగులచవితి పర్వదినం సందర్భంగా తిరుమలలో శ్రీ మలయప్పస్వామి తిరుమాడ వీధులలో పెద్దశేషవాహనంపై భక్తులకు దర్శమిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందు కుంటున్నారని చెప్పారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడని అన్నారు.
మలయప్ప స్వామి శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కలిసి ఊరేగుతారని పేర్కొన్నారు. 29న రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరుగనుందని తెలిపారు.