Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీవారి రథోత్సవం వైభవంగా సాగింది. ఆద్యాంతం భక్తుల జయజయధ్వానాల మధ్య రథోత్సవం కొనసాగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి రథంపై నుంచి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు రథాన్నిలాగారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తిరుమలకు భారీగా చేరుకోగా.. గ్యాలరీలు కిక్కిరిశాయి.
ఇక రాత్రి మలయప్పస్వామి అశ్వవాహన సేవ ముగియనున్నది. అశ్వవాహనంపై అశ్వంపై కల్కి అవతారంలో భక్తులకు స్వామివారు అనుగ్రహించనున్నారు. ఈ అశ్వవాహన సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. రేపు చివరిఘట్టమైన చక్రస్నానంతో ఉత్సవాల పరిసమాప్తి కానున్నాయి. శనివారం దసరా పండుగ రోజున మలయప్పస్వామి, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు. భక్తులు సైతం పుణ్యస్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. శ్రీవారి సర్వదర్శనానికి 26 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60,775 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 25,288 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.88కోట్లు ఆదాయం సమకూరింది.