ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్గా మధుమూర్తిని ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే రోజు ఉన్నత విద్యామండలి చైర్మన్గా ఉన్న హేమచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. వైస్ చైర్మన్ రామ్మోహన్ రావునే ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మధుమూర్తిని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .
కొత్తగా ఉన్నత విద్యామండలి చైర్మన్గా నియమితులైన మధుమూర్తి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి మండలం జాగర్లమూడి గ్రామం. విశాఖలో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణలోని హనుమకొండలో నివాసం ఉంటున్నారు. వరంగల్ నీట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.