చిన్న మనస్పర్థలకే ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట.. ఒకే దగ్గర ఖననం చేసిన ఇరు కుటుంబాలు
వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం జరిగింది. చిన్నపాటి మనస్పర్థలకే ఓ ప్రేమజంట తనువు చాలించింది. వారి ప్రేమ విషయం తెలిసిన కుటుంబసభ్యులు.. చావులో అయినా వారిని కలిసి సాగనంపాలని ఇద్దరినీ ఒకే దగ్గర ఖననం చేశారు.
ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కులాలు వేరైనా జీవితంలో స్థిరపడితే పెద్దలే తమ పెళ్లి చేస్తారని అనుకున్నారు. అదే లక్ష్యంగా పెట్టుకుని కష్టపడ్డారు. కానీ ఈ క్రమంలో వచ్చిన చిన్న మనస్పర్థలే అంతా తలకిందులు చేసింది. చిన్నపాటి గొడవకే ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
కడప జిల్లా చెన్నూరుకు చెందిన యోగేంద్రకుమార్ వర్మ (19), హేమశ్రీ(19) ఇద్దరూ కడప నగరంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు. అక్కడ ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో కష్టపడి చదవి జీవితంలో స్థిరపడ్డాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని నిర్ణయించారు.
కానీ ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన యోగేంద్ర కుమార్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలిసిన హేమశ్రీ కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వారి ప్రేమ గురించి తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కలిసి జీవించలేకపోయారు.. కనీసం మరణంలో అయినా కలిసి సాగనంపాలని నిర్ణయించుకుని.. చెన్నూరు సమీపంలో ఒకే ప్రాంతంలో ఇద్దరిని ఖననం చేసి, అంత్యక్రియలు పూర్తి చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కస్తాలలో సబ్ స్టేషన్ ముందు రైతుల నిరసన
విద్యుత్ వైరు తెగిపడి పాడి బర్రె మృతి
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

