తిరుచానూరులో భక్తుల సౌకర్యాల కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు : టీటీడీ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే ఆకాశం ఉన్నందున వసతులు పెంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ జేఈవో
తిరుపతి :తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. వీరికి వసతులు పెంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎఫ్ఎ అండ్ సీఈవో బాలాజీతో కలిసి ఆయన ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. యాగశాలలో నిరుపయోగంగా ఉన్న సామగ్రిని తొలగించడం వల్ల ప్రదక్షిణ చేయడానికి సౌకర్యంగా ఉందన్నారు.
ప్రసాదాల పంపిణీ కేంద్రాల వద్ద క్యూలైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆలయంలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని అదనపు ఆరోగ్యాధికారికి సూచించారు. ఫ్రైడే గార్డెన్లో దిగుడు బావిని పరిశీలించి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. బావిలోని ఊట నీరు ఆలయ అవసరాలకు ఉపయోగపడతాయేమో పరిశీలన జరపాలని పేర్కొన్నారు.
అనంతరం పూలమాలల తయారీ ప్రాంతం, పిండి మర, విద్యుత్ గదిని పరిశీలించారు. అమ్మవారి ఆలయ పుష్కరిణి సందర్శించి అక్కడ చేపట్టవలసిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. తోళప్ప గార్డెన్, వాహన మండపం వద్ద జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

