తిరుమల : లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ( Om Prakash Birla ) , రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఆదివారం ఉదయం తిరుమల ( Tirumala ) శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వారిని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ( BR Naidu) , అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
వీరు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి మూలమూర్తి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, అదనపు ఈవో కలిసి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్ర పటం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, రాజ్యసభ ఎంపీ సుధా నారాయణమూర్తి పాల్గొన్నారు.