సింహంతో సెల్ఫీ దిగబోయి యువకుడి బలి
ఓ సందర్శకుడు సెల్ఫీ మోజులో జూపార్కులోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి దాని పంజాకు బలయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి నగర శివారులోని ఎస్వీ జూపార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఓ సందర్శకుడు సెల్ఫీ మోజులో జూపార్కులోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి దాని పంజాకు బలయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి నగర శివారులోని ఎస్వీ జూపార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న సందర్శకుడు సింహంతో సెల్ఫీ దిగేందుకు ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. సింహం గర్జించడంతో భయపడి ఓ చెట్టు ఎక్కాడు. కొమ్మ విరిగిపడటంతో సింహం పంజా విసిరింది. అతని మెడపై దాడి చేసి నోటితో కొరికింది.
తీవ్రగాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ (38)గా అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లడంతో సింహం దాడి చేసినట్టు జూపార్కు సిబ్బంది తెలిపారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అందరినీ బయటకు పంపించారు. జూలోనికి సందర్శకులను సైతం అనుమతిని నిరాకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Lion
- selfie
- Tirupati zoo
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

