AP New | విశాఖపట్నంలోని ఈస్టిండియా పెట్రోలియం కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కంపెనీలోని పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్పై పిడుగుపడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 20 ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా, వైజాగ్లో అగ్నిప్రమాద ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.పెట్రోలియం కంపెనీలో ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.