అమరావతి : తనపై ఫేక్ వీడియో కాల్ సృష్టించి పరువుకు భంగం కలిగించిన టీడీపీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు హిందూ పురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెల్లడించారు. ఫేక్ వీడియో, అమెరికా ల్యాబ్ నకిలీ రిపోర్టు విషయంపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశానని, వీటిపై సమగ్ర దర్యాప్తు చేసి చట్టపర మైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన చెప్పారు.
ఓటుకు నోటు కేసులో లేనని చంద్రబాబు కాణిపాకం గణపతి సాక్షిగా ప్రమాణం చేస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. వీడియా కాల్తో ఫేక్ అని పోలీసులు తేల్చి చెప్పారని అన్నారు. అంతిమంగా ధర్మానిదే విజయమని, తన విషయంలో అదే నిరూపిత మవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తప్పుడు రాజకీయాలు మానుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.