అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా న్యాయవాదుల సం ఘం ఇవాళ బైక్ ర్యాలీ నిర్వహించింది . జిల్లా కోర్టు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును కర్నూలుకు తరలించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అభివృద్ధికి నోచుకోని రాయలసీమ ప్రాంతమైన కర్నూలులో ఉన్నత న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గతంలో రాజధానిగా ఉన్న కర్నూలును తొలగించడం వల్ల ఈ ప్రాంతం వెనుకబడి పోయిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించిందని ఈ మేరకు న్యాయ వ్యవస్థ రాజధానిగా కర్నూలుకు ఏపీ హైకోర్టును తరలించాలని కోరారు.