Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదం.. చనిపోయిన బైకర్ శివశంకర్‌పై కేసు నమోదు
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో బైకర్ శివశంకర్‌పై కేసు నమోదైంది. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు శివశంకర్‌పై సెక్షన్ 281, 125A, 106 (1) సెక్షన్ల కింద ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో బైకర్ శివశంకర్‌పై కేసు నమోదైంది. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు శివశంకర్‌పై సెక్షన్ 281, 125A, 106 (1) సెక్షన్ల కింద ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.
తాను, శివశంకర్ కలిసి మద్యం తాగామని.. ఆ మత్తులో శివశంకర్ నిర్లక్ష్యంగా బైక్‌ను నడపడం వల్ల ప్రమాదం జరిగిందని ఎర్రిస్వామి ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమ బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరం పడిపోయామని తెలిపాడు. ఈ ఘటనలో శివశంకర్ స్పాట్లోనే మరణించగా.. తాను గాయాలతో బయటపడ్డానని అన్నాడు. ప్రమాదం తర్వాత శివశంకర్ మృతదేహాన్ని పక్కకు తీసేందుకు ప్రయత్నించానని తెలిపాడు. ఇంతలో తమ బైక్‌ను ఓ వాహనం ఢీకొట్టగా రోడ్డు మధ్యలోకి వచ్చిందన్నారు. దాని తర్వాత వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును లాక్కెళ్లిందని ఎర్రిస్వామి ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలా బైక్‌ను ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగి బస్సు దగ్ధమైందని చెప్పాడు.
Man responsible for Kurnool bus accident.
Clearly, he is out of control.
Licenses of such undisciplined youths should be revoked.
— India Flick (@IndiaFlick) October 25, 2025
కాగా, కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన విశ్లేషణ నివేదికను కర్నూలు ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సమర్పించింది. దీని ప్రకారం బైకర్ శివశంకర్ మృతదేహం నుంచి సేకరించిన శాంపిల్స్‌లో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

