హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ(సస్పెండెడ్) నాగరాజును సిట్ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నాగరాజు ఇంటివద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది.
కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ అధికారులు నాగరాజు ఇంటికి వెళ్లగా వారిని కుటుంబ సభ్యులు, బంధువులు ప్రతిఘటించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను మోహరించారు. కృష్ణలంకకు చెందిన సాయికృష్ణను లాకప్ డెత్ చేసి ఉంటారనే అనుమానంతో సిట్ దర్యాప్తు చేస్తున్నది.