27న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. బ్రేక్ దర్శనాలు రద్దు
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 27న ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు.
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 27న ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. మంగళవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీంతో ఆరోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రద్దు చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 26న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఏటా.. ఉగాది, అణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగు సార్లు శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉత్సవంగా నిర్వహిస్తారు. దీనినే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు. కోయిల్ అంటే గుడి.. ఆళ్వార్ అంటే భక్తుడు. శ్రీ వైష్ణవ పరంపరలో ఆళ్వార్లు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన భక్తులు. తిరుమంజనం అంటే అభిషేకం. కర్పూరం, చందనం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ.. తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపి శ్రీవారి ఆలయాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో శుద్ధి చేస్తారు. అందుకే ఈ సేవకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

