హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న చెప్పారు.
శ్రీవారి వైకుంఠద్వార దర్శన టికెట్లకు భారీ డిమాండ్ ఉన్నది. ఇప్పటికే ఆన్లైన్లో విడుదల చేసిన 1.40 లక్షల టికెట్లు అయిపోగా.. ఆఫ్లైన్ టికెట్లకు పోటీ నెలకొన్నది. ఈ టికెట్లను జనవరి 8 నుంచి విడుదల చేసేలా టీటీడీ ఏర్పాట్లుచేస్తున్నది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో పీఎంఎస్ ప్రసాద్ బుధవారం తిరుమల ప్రసాదం ట్రస్టుకు రూ.1,11,11,111 విరాళంగా అందించారు. విరాళం డీడీని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరికి అందజేశారు.