Nagula Chavithi | హైదరాబాద్ : నాగుల చవితి రోజున అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శివలింగంపై ఓ రెండు నాగుపాములు ప్రత్యక్షమయ్యాయి. ఆ రెండు నాగుపాములు కూడా శివలింగానికి ఇరువైపులా పడగవిప్పి.. భక్తులకు దర్శనమిచ్చాయి.
నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న విశ్వనాథస్వామి దేవస్థానంలో నాగుల చవితిని పురస్కరించుకుని ఇవాళ ఉదయం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమయంలో గుడి ప్రాంగణంలోని శివలింగంపైకి రెండు నాగుపాములు చేరుకున్నాయి. తదనంతరం ఆ రెండు పాములు కూడా పడగవిప్పి నిల్చుని నాట్యమాడాయి. శివలింగంపై నిల్చున్న రెండు నాగుపాములను చూసి భక్తులు తరించిపోయారు.
నాగుల చవితి రోజు అద్భుత దృశ్యం
శివలింగంపైన పడగవిప్పి నిల్చున్న నాగుపాములు
నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న విశ్వనాథస్వామి దేవస్థానంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో గుడి ప్రాంగణంలోని శివలింగంపైకి చేరుకొని పడగవిప్పి నిల్చున్న రెండు… pic.twitter.com/LmGDUk6OAL
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2025