తిరుమల : తిరుమలలో తెలంగాణకు చెందిన బాలుడి అపహరణ(Kidnap) కలకలం సృష్టిస్తుంది. తెలంగాణ(Telangana) లోని గద్వాల్‌కు చెందిన మూడు సంవత్సరాల బాలుడు అభినయ్‌ను యాత్రికుల వసతి సముదాయం 2 వద్ద గుర్తుతెలియని మహిళ కిడ్నాప్ చేసింది. తమ కుమారుడు కనిపించడం లేదంటు బాలుడి తల్లిదండ్రులు వెంటనే ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలించారు.
గుర్తుతెలియని మహిళ బాలుడిని తీసుకెళ్లడాన్ని సీసీ పుటేజీలో గుర్తించి బాలుడి ఆచూకి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే బాలుడు అభినయ్ ని తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు.