అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ (YCP) హయాంలో నియమితులైన ఫైబర్‌నెట్ (Fibernet ) కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో తొలి విడతగా 410 మందిని తొలగించింది(Dismissal) . మరో రెండు వందల మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ సందర్భంగా ఫైబర్‌నెట్ చైర్మన్ జీవీ రెడ్డి (Chairman GV Reddy) మాట్లాడుతూ ఏపీ ఫైబర్‌నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు.
గత వైసీపీ ప్రభుత్వం అర్హతలేని వారిని ఫైబర్‌నెట్‌లో నియమించిందని ఆరోపించారు. కొందరు సిబ్బంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేశారని , వేతనాల పేరుతో ఫైబర్‌నెట్ నుంచి రూ. కోట్లు దుర్వినియోగం జరిగిందని వెల్లడించారు . వైసీపీ ప్రభుత్వ వైఖరితో సైబర్నెట్ దివాలా అంచుకు చేరిందని అన్నారు.
తాము కక్ష , దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదని, ఉద్యోగులకు లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరుతామన్నారు. అవసరం మేరకు ఉద్యోగులను తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఫైబర్‌నెట్ నుంచి ప్రముఖ దర్శకుడు ఆర్జీవీకి ( Director RGV ) అక్రమంగా డబ్బు చెల్లించారని తెలిపారు. డబ్బు చెల్లించేందుకు ఆర్జీవీకి 15 రోజుల సమయం ఇచ్చామని, గడువులోగా డబ్బు చెల్లించకుంటే ఆర్జీవీపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.