అమరావతి : కార్తిక మాసంలో (Karthikamasam)నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం . కాని ఓ కుటుంబంలో అది విషాదం నింపింది. పల్నాడు (Palnadu ) జిల్లా రెంటచింత మండలం తుమృకోటలో కార్తిక స్నానానికి వెళ్లిన దంపతులు నీట మునిగి చనిపోవడం పండుగపూట గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
నీలా సత్యనారాయణ, పద్మావతి అనే దంపతులు శనివారం కార్తిక మాసం సందర్భంగా కృష్ణనదికి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు నదిలో పడి ఇద్దరు మృతి చెందారు. అక్కడే ఉన్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు.
కొంత దూరంలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కావడంతో వాటిని ఒడ్డుకు చేర్చి పంచనామా నిర్వహించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.