Madhavi Reddy | స్వాతంత్య్ర దినోత్సవంలో కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. కడప పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో స్టేజిపైన, మంత్రి పక్కన తనకు కుర్చీ వేయలేదని ఆమె అలిగారు. ప్రొటోకాల్ పాటించలేదని జేసీ అతిథి సింగ్‌పై ఆమె చిందులు తొక్కారు. గుడ్లు ఉరిమేలా చూస్తూ జేసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే మాధవి రెడ్డి అలగడంతో కలెక్టర్ కలుగజేసుకుని ఆమెను స్టేజిపైకి రావాలని ఆహ్వానించారు. కానీ అప్పటికే కోపంతో ఊగిపోయిన మాధవి రెడ్డి స్టేజిపైకి వెళ్లడానికి తిరస్కరించింది. దీంతో అక్కడకు వెళ్లి కూర్చోవాలని సూచించారు. అయినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగేంత వరకు దాదాపు అరగంటపాటు అక్కడే నిల్చుండి కార్యక్రమాలను తిలకించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
మళ్లీ అలిగిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పక్కన కుర్చీ వేయలేదని అలిగి వెళ్లిపోయిన మాధవి రెడ్డి
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వివాదాస్పదంగా మారిన కడప ఎమ్మెల్యే తీరు
పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా జేసీ… pic.twitter.com/ZtESE8Rt89
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2025