ఏపీ రాజధానిపై జస్టిస్ దేవానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు
Interesting comments| ఆంధ్రప్రదేశ్ రాజధానిపై హైకోర్టు జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఏపీకి రాజధాని ఏది అంటూ జరిగిన అనుభవాన్ని వివరించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై హైకోర్టు జడ్జి జస్టిస్ దేవానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఏపీకి రాజధాని ఏది అంటూ జరిగిన అనుభవాన్ని వివరించారు. రాష్ట్ర రాజధాని ఇదీ అనే చెప్పుకునే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. ప్రపంచ రచయితల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో ఇవాళ అమృతభారతి పుస్తకా విష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. 75 ఏళ్ల తర్వాత తెలుగు వారి పరిస్థితి ఏమిటని ఆయన అన్నారు. గొప్పగా చెప్పుకోవచ్చగాని ఏం సాధించామని పునరాలోచన చేసుకోవాలని కోరారు. ఢిల్లీలో చదువుతున్న మా అమ్మాయిని మీ రాజధాని ఏదని ఆటపట్టి స్తున్నారని తెలిపారు. మన పిల్లలు కూడా తలవంచుకునే స్థితిలో ప్రస్తుతం తెలుగుజాతి ఉందని ఆవేదన చెందారు.
ప్రతిదానికి కులం, రాజకీయం, స్వార్థం సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయని వెల్లడించారు. ఇలాంటి అవలక్ష ణాలు మార్చాల్సిన బాధ్యత రచయితలదేనని పేర్కొన్నారు. రచయితలు సామాన్యులను చైతన్యపరిచే గొప్ప మేథాశక్తి కలిగినవారని అభివర్ణించారు. పుస్తకావిష్కరణలో మండలి బుద్దప్రసాద్ తదతరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

