భారత్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు మంగళవారం విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ‘టైగర్ ట్రయంప్-2025’ పేరుతో నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు రెండు వారాలపాటు జరుగనున్నాయి.
ఇందులో రెండు దేశాలకు చెందిన 3000 మంది సైనికులు, నాలుగు నౌకలు, ఏడు విమానాలు పాల్గొంటున్నాయి.