తిరుమల : టీటీడీ పాలక మండలికి, ప్రభుత్వానికి టీటీడీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి ( Janga Krishnamurthy) జలక్ ఇచ్చారు. తన సభ్యత్వానికి రాజీనామా ( Resign) చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు లేఖను పంపారు. ఇటీవల ఓ పత్రికలో వచ్చిన కథనానికి మనస్తాపానికి గురై రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. అయితే తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయలేదని విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
రాజీనామా వెనుక జరిగిన పరిణామాలను వివరించారు. తనకు గతంలో తిరుమలలో కేటాయించిన స్థలాన్ని తిరిగి ఇవ్వాలని ప్రభుత్వానికి, టీటీడీ బోర్డుకు విజ్ఞప్తి చేశానని తెలిపారు.తనకు అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పాటు పత్రికలో తనపై వచ్చిన అసత్య ప్రచారంపై మనస్తాపానికి గురై రాజీనామా చేసినట్లు వివరించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఇబ్బంది రావద్దని తాను రాజీనామా చేశానని స్పష్టం చేశారు.