Viral Video | జనసేన నాయకుల రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఘటన మరువకముందే తనను మోసం చేశాడంటూ మరో జనసేన నాయకుడి బాగోతాన్ని ఓ మహిళ బయటపెట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసం జడ్పీటీసీ జయప్రకాశ్ నాయుడు తననను ఆర్థికంగా, శారీరకంగా వాడుకుని చిత్రహింసలు పెడుతున్నాడని భీమవరం గునుపూడికి చెందిన మద్దాల విజయలక్ష్మీ అనే మహిళ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో దుమారం రేపుతోంది.
తాను పవన్ కల్యాణ్ ఫ్యాన్ అని.. ఆ అభిమానంతో భీమవరంలోని జనసేన పార్టీ ఆఫీసులో జరిగే ప్రతి కార్యక్రమానికి వెళ్లేదాన్ని అని ఆ వీడియోలో విజయలక్ష్మీ తెలిపింది. అప్పుడే జయప్రకాశ్‌తో తనకు పరిచయం ఏర్పడిందని పేర్కొంది. ఆ పరిచయంతోనే ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడని.. పెళ్లిచేసుకుంటానని ప్రపోజ్ చేశాడని చెప్పింది. కానీ అప్పటికే తనకు పెళ్లయి, విడాకులు తీసుకున్నానని.. మనకు సెట్ అవ్వదని చెప్పానని తెలిపింది. కానీ తనకు కూడా పెళ్లయ్యింది.. భార్య వదిలేసిందని.. నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి దగ్గరయ్యాడని తెలిపింది. అలా ఇద్దరూ రెండేళ్లు కలిసి ఉన్నామని బాధితురాలు తెలిపింది.

Janasena Zptc Victim1
ఈ క్రమంలోనే ఇల్లు కొంటున్నానని, ఆర్థికంగా ఇబ్బంది ఉందని చెప్పి రూ.10లక్షలు, బంగారం తీసుకున్నాడని బాధితురాలు వీడియోలో తెలిపింది. అప్పట్నుంచి జయప్రకాశ్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఇష్టం లేనట్లుగా చూడటం, కొట్టడం వంటివి చేసేవాడని తెలిపింది. మద్యం మత్తులో తనను శారీరకంగా టార్చర్ చేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. వాతలు వచ్చేలా కొట్టాడని తెలిపింది. ఆ గాయాలను బయటపెట్టింది. గంజాయి కలిపిన స్వీట్లు తినమని ఒత్తిడి చేసేవాడని వాపోయింది. అతని టార్చర్ భరించలేక పుట్టింటికి వెళ్లిపోయినా.. వేధించేవాడని పేర్కొంది.ఆ వేధింపులు తాళలేక దూరం వెళ్లిపోదామని అనుకుంటే.. నీ ఫొటోలు, వీడియోలు ఉన్నాయని బెదిరిస్తున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ఆ వీడియోలో కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
మరో జనసేన నేతపై లైంగిక ఆరోపణలు తెరపైకి వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ZPTC జయప్రకాశ్ నాయుడు తనను శారీరకంగా వాడుకోవడమే కాకుండా డబ్బు, నగలు తీసుకున్నాడని ఓ మహిళ వీడియోని సోషల్ మీడియాలో విడుదల చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది.#janasena #apnews pic.twitter.com/HbGmWXI0MZ
— News18 Telugu (@News18Telugu) April 9, 2026
ఈ వీడియో బయటకు రావడంపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. జనసేన పార్టీ కాస్త కామసేనగా మారిపోయిందని వైసీపీ అధికార ప్రతినిధి వీర శేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాక జనసేన నాయకులు, కార్యకర్తలు కీచకుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ జనసేన జడ్పీటీసీ జయప్రకాశ్ నాయుడి బాగోతం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఓ మహిళను ఆర్థికంగా, శారీరకంగా వాడుకుని మోసం చేసి, చిత్రహింసలకు గురిచేస్తున్నాడని పేర్కొన్నారు. మీ పార్టీ వాళ్లే కీచకుల్లా ప్రవర్తిస్తుంటే.. నోరు తెరవకుండా ఎక్కడ నిద్రపోతున్నావని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను నిలదీశారు.