Pawan Kalyan | అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందంజలో ఉన్నారు. 4300 లీడ్‌తో పవన్ దూసుకుపోతున్నారు. వైసీసీ అభ్యర్థి వంగా గీత వెనుకంజలో ఉన్నారు. టీడీపీ 12, జనసేన 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లీడ్‌లో ఉన్నాయి. ఇక తెనాలి లోక్‌సభ నియోజకవర్గంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ లీడ్‌లో ఉన్నారు.