(Jalaripeta Issue) విశాఖపట్నం: జాలారిపేటలో మత్స్యకారుల వర్గాల మధ్య తలెత్తిన వివాదం బోట్లను కాల్చేసే వరకు వెళ్లింది. ఇప్పటివరకు మూడు బోట్లు కాలి బూడిదయ్యాయి. ఇవ్వాల మరో బోటును ఒక వర్గం వారు కాల్చివేసినట్లు సమాచారం. ఈ వివాదానికి తెరదించేందుకు మత్స్యకార పెద్దలు రెవెన్యూ, పోలీసు అధికారులతో సంప్రదింపులు కూడా మొదలుపెట్టారు. కాగా, మత్స్యకార ప్రాంతాల్లో సమస్య తీవ్రతను ఇండియన్ నేవీ హెలికాప్టర్ల ద్వారా సమీక్షిస్తున్నది.
విశాఖ తీరంలోని మత్స్యకార గ్రామాల్లో చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. రింగు వలలను వాడొద్దని సంప్రదాయ మత్స్యకారులు చాన్నళ్లుగా కోరుతున్నారు. అయితే, వీటిని ఒక వర్గం వారు పట్టించుకోవడం లేదు. పైగా ఐదుగురు మత్స్యకారులపై దాడికి పాల్పడ్డారు. దాంతో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వివాదం చోటుచేసుకున్నది. దాంతో రింగు వలలు వాడుతున్న వారి బోట్లకు మరో వర్గం వారు నిప్పుపెట్టారు. తీరానికి చాలా దూరంలో ఇవాళ మరో బోటుకు నిప్పు పెట్టారు. రింగు వలలతో చేపలు పడుతున్న వారికి ఆర్థిక నష్టాన్ని కలిగించాలన్న దురుద్దేశంతోనే ఈ దుందుడుకు చర్యలకు దిగినట్లు తెలుస్తున్నది. గతంలో ఘర్షణలకు దిగినప్పటికీ.. ఇలా బోట్లను కాల్చివేసే స్థాయికి రావడం ఇదే మొదటిసారి. వివాదానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు మత్స్యకార సంఘం పెద్దలు చర్చలకు పూనుకుంటున్నారు. ఇందుకు రెవెన్యూ, పోలీసు అధికారుల సాయం తీసుకుంటున్నారు. అగ్నికి ఆహుతైన ఒక్కో బోటు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..