అమరావతి : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) విద్యుత్ ఒప్పందాల్లో అవినీతికి పాల్పడలేకపోతే ఒకసారి అమెరికాకు వెళ్లిరావాలని మాజీ మంత్రి , టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ( Dokka Varaprasad ) సవాల్ విసిరారు. సెకీతో (SEKI) చేసుకున్న ఒప్పందంలో అదానీ ఇచ్చిన లంచం నువ్వు తినకపోతే ఎవరు తిన్నరో చెప్పాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఒప్పందాల్లో పొరపాటు జరిగింది. డబ్బు తిన్నానని ఒప్పుకోవాలని వెల్లడించారు. నీ హయంలో జరిగిన దానికి నువ్వు కాక ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. జగన్ నిర్ణయం వల్ల అటు క్రైస్తవులు, ఇటు రెడ్డిలు అవమానంగా ఫీలవుతున్నారని పేర్కొన్నారు.
మోసానికి చొక్కా ప్యాంట్ వేస్తే అచ్చం జగన్లానే ఉంటుందని ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్ల లావాదేవీల వ్యవహారంలో జగన్ తప్పించుకోవడం కుదరదని అన్నారు. చార్జిషీట్లో జగన్ పేరు ఉందని వెల్లడించారు. రాష్ట్ర పోలీసుల నుంచి తప్పించుకోవాలన్నా అమెరికాలో జగన్కు శిక్ష తప్పదని, జగన్కు ధైర్యముంటే ఒకసారి అమెరికా వెళ్లి రావాలని పేర్కొన్నారు.