అమరావతి : కూటమి ప్రభుత్వంపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ( False propaganda) నమ్మవద్దని ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ( Gottipati Ravikumar) రాష్ట్ర ప్రజలను కోరారు. రాష్ట్రంలో రైతులకు స్మార్ట్ బిగించడం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న రెండువందల ఉచిత విద్యుత్ (Free Power) యూనిట్లను తగ్గిస్తున్నామని ప్రచారం చేయడంలో నిజం లేదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పారిశ్రామిక నూతన విధానాలతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకు వైసీపీ హయాంలో తరలివెళ్లిన పరిశ్రమలు తిరిగి ఏపీలో పెట్టడానికి ఆసక్తిని కనబరుస్తున్నారని వెల్లడించారు.
రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు గాను కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల పీఆర్సీ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కరించేందుకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు.