అమరావతి : మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అసెంబ్లీలో కేవలం ఫ్లోర్ లీడర్(Floor Leader) మాత్రమేనని ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ ( Minister Payyavula Kesav) పేర్కొన్నారు. గత శాసనసభలో జగనే స్వయంగా చెప్పారు. 10 శాతం కూడా సభ్యులు లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని నిలదీశారు. ఓనమాలు కూడా తెలియకుండా స్పీకర్‌కు లేఖ ఎలా రాశారని మండిపడ్డారు.
శాసనసభలో అన్ని పార్టీల మాదిరే జగన్ కూడా ఫ్లోర్ లీడరేనని వెల్లడించారు. నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా అవకాశం లేదని స్పష్టం చేశారు. జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా రావడానికి ఓ పదేళ్లు పడుతుందని అన్నారు. స్పీకర్(Speaker) కు లేఖ రాసి జగన్ బెదిరించే ప్రయత్నం చేశారని , తన ఖాతా పుస్తకాలతో పాటు నిబంధనలు కూడా చదవాలని సూచించారు.
ఇటీవల రెండు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ హుందాగానే వ్యవహరించిందని మంత్రి తెలిపారు. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో లేఖ రాయడమేంటని ప్రశ్నించారు.