అమరావతి : భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలకు(ISRO scientists ) హ్యాట్సాఫ్, నా సెల్యూట్ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. వారు కంటికి కనిపించే దేవుళ్లని ప్రశంసించారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్(Satish Dawan) అంతరిక్ష కేంద్రంలో జరిగిన ప్రపంచ అంతరిక్ష ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికను అందిపుచ్చుకుని ఒకే రాకెట్ నుంచి వందకు పైగా ఉపగ్రహాలు విదేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను సతీష్ ధావన్ కేంద్రం నుంచి పంపడం చంద్రునిపైకి పంపడం అభినందనీయమని అన్నారు.
విజయవంతంగా ఉపగ్రహాలను పంపి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇస్రోకు రుణపడాలని, సైంటిస్టులు భారతదేశానికి నిజమైన హీరోలని కొనియాడారు. నాకు కూడా చిన్నప్పటి నుంచి శ్రీహరి కోటాకు రావాలని అనుకునేవాడని, అది ఇప్పుడు నెరవేరిందని అన్నారు. చదువుకునే రోజుల్లో అంతరిక్షం గురించి టీచర్లను అడిగేవాడినని గుర్తు చేస్తుకున్నారు.
MLC By-election | విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు.. పోటీలో ఇద్దరే అభ్యర్థులు
Tirumala | ఆగస్టు 19న నవంబర్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్లైన్ కోటా విడుదల