అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐపీఎస్‌లను ( IPS Transfers ) బదిలీ చేసింది. మార్కాపురం జిల్లా ఓఎస్డీగా నవజ్యోతి మిశ్రా( Navajyothi Mishra ) ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ అడ్మిన్‌గా పాటిల్దేవ్ రాజ్ మనీష్, పోలవరం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా మందా జావలి అల్ఫోన్స్, అమరావతి ఓఎస్డీ లా అండ్ ఆర్డర్‌గా మనోజ్ రామనాథ్ హెగ్డే, పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి, నంద్యాల ఏఎస్పీగా సుస్మితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.