AP DGP | అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమల రావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ ఆఫీసు సిబ్బంది.. తిరుమలరావుకు శుభాకాంక్షలు తెలిపారు.
బాధ్యతల స్వీకరణ కంటే ముందు ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఏపీ నూతన డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం, చిత్రపటం ఆలయ అధికారులు అందజేశారు.