అమరావతి : ఆక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్న తిరుమల బ్రహ్మోత్సవాలకు(Tirumala Brahmotsavam) హాజరుకావాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు(CM Chandra Babu) టీటీడీ అధికారులు ఆహ్వానపత్రికను అందజేశారు.
టీటీడీ (TTD) ఈవో శ్యామలారావు, అదనపు ఈవో , తిరుమల అర్చకులు ఆదివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆహ్వానపత్రికను అందజేసి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరారు. సీఎంకు అర్చకులు,వేద పండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.