INS Arighaat | విశాఖపట్నం: జలాంతర్గామి నుంచి ప్రయోగించే అణ్వాయుధ సామ ర్థ్యం గల ఖండాంతర క్షిపణిని భారత్ పరీక్షించింది. ఇది 3,500 కి.మీ. పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. అణ్వాయుధ సామర్థ్యం గల జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి దీనిని విశాఖపట్నం నుంచి ప్రయోగించి, పరీక్షించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ క్షిపణి విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించిందా? లేదా? అనే విషయం త్వరలోనే తేలనుంది. ఐఎన్ఎస్ అరిఘాత్‌ను భారత నావికా దళంలో ఆగస్టులోనే ప్రవేశపెట్టారు. దీని నుంచి కె-4 క్షిపణిని పరీక్షించడం ఇదే మొదటిసారి. కె-4 క్షిపణిని అనేక సంవత్సరాలుగా సబ్ మెర్సిబుల్ పంటూన్స్ నుంచే పరీక్షిస్తున్నారు. కె-4 క్షిపణిని డీఆర్డీఓ అభివృద్ధి చేసింది.